రివ్యూ : బ్రాండ్ బాబు

రివ్యూ : బ్రాండ్ బాబు


 

Brand Babu Movie Review

మూవీ రివ్యూ : బ్రాండ్ బాబు

రేటింగ్ : 2/5

నటీ నటులు : సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బా,మురళీ శర్మ,సత్యం రాజేష్ తదితరులు .

కథ : మారుతి

సంగీతం : జీవన్ బాబు (జె బి)

నిర్మాత : శైలేంద్ర బాబు

దర్శకత్వం : ప్రభాకర్.పి

బాల్యం నుండీ తండ్రి (మురళీ శర్మ ) తన కొడుకుని (సుమంత్ శైలేంద్ర) ని బ్రాండ్ కి బాగా అలవాటు చేసి అహంకారంతో పెంచుతాడు. ఇంట్లో తన సొంత తండ్రి చనిపోయినా నలుగురిలోనూ ఏడవకుండా నాలుగు గోడల మధ్య ఏడ్చి , నలుగురిలో ఉన్నప్పుడు కేవలం ఎక్స్ప్రెషన్స్ తప్ప ఎమోషన్స్ చూపించకూడదు అనే అహాన్ని నూరిపోస్తూ పెంచుతాడు తండ్రి.

పేద,మధ్యతరగతి ప్రజలంటే హీనంగా చూసే హీరో కి, తను పెళ్ళంటూ చేసుకుంటే ఒక గొప్పింటి అమ్మాయినే చేసుకోవాలని తద్వారా తన బ్రాండ్ పెంచుకోవాలని భావిస్తూ ఉంటాడు., అలా 'హోమ్ మినిస్టర్' కూతురు అయినటువంటి పావని (పూజిత పొన్నాడ ) ని పెళ్ళిచేసుకోవాలని తలచి , అనుకోకుండా అదే ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి(ఇషా రెబ్బ) ప్రేమలో చిక్కుకుంటాడు . అసలే పేద , మధ్య తరగతి జనాల్ని అసహ్యించుకునే హీరో అతని తండ్రికి ఎలాంటి సందర్భాలు ఎదురయ్యాయి అనేది మిగతా కాదాంశం.

విశ్లేషణ : కథ పరంగా కొత్తదేం కాదు, మన అల్లరి నరేష్ నటించిన "సీమ టపాకాయి " మరియు "అత్తిలి సత్తిబాబు " సినిమాలు గుర్తొస్తాయి. మొదటి భాగం సరదా.. సరదాగా గడిచిపోతుంది.రెండవ భాగం "బోర్" ఫీలింగ్ వచ్చినప్పటికీ కామెడీ తో మెప్పించడంలో దర్శకుడు ప్రభాకర్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

దర్శకుడు "మారుతి" ఈ చిత్రానికి కదా రచయితా..? లేక దర్శకుడా అనే ఫీలింగ్ కలగడం కాయం. ఎందుకంటే హీరో క్యారెక్టర్ లో "మహానుభావుడు " షేడ్స్ కనిపిస్తాయి. సంగీతం పరవాలేదు., నిర్మాణ విలువలు ఆకర్షిస్తాయి.

నటీ నటుల పనితీరు : హీరో 'సుమంత్ శైలేంద్ర' నటన ఆకట్టుకోదు, 'మురళీ శర్మ' నటన సినిమాకి ప్రధమ బలం, హీరోయిన్ 'ఇషారెబ్బ' కూడా మంచి నటన కనపరిచింది, మరొక హీరోయిన్ 'పూజ' కి నటించే స్కోప్ లేదు, 'రాజా రవీంద్ర' క్యారెక్టర్ ని సరిగా తీర్చి దిద్దలేదు., 'సత్యం రాజేష్ ' ఉన్నంతలో మెప్పించాడు.

ఓవరాల్ గా "బ్రాండ్ బాబు" లో 'బ్రాండ్ ఐటెం' లేక పోయినా ., కాలక్షేపానికి 'వినోదం' అయితే పొందగలం. కాలక్షేపానికి ఒకసారి చూడొచ్చు👍

Comments