రివ్యూ:సాక్ష్యం

రివ్యూ:సాక్ష్యం


 

Saakshyam telugu Movie review

రివ్యూ: సాక్ష్యం

రేటింగ్‌: 2.75/5
న‌టీన‌టులు:బెల్లంకొండ సాయి శ్రీనివాస్,పూజా హెగ్డే,శరత్ కుమార్,మీనా,జగపతిబాబు,అశుతోష్ రానా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: శ్రీవాస్
నిర్మాత‌: అభిషేక్ నమ

‘జయ జానకి నాయక’ సినిమాతో బెల్లకొండ సాయి శ్రీనివాస్ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో పక్కా కమర్షియల్ హీరోగా మారాడు. ఈ క్రమంలో ‘సాక్ష్యం’ అనే ఫాంటసీ థ్రిల్లర్‌లో నటించాడు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

అదిరిపోయే విజువల్స్‌తో, అద్భుతమైన నేపథ్య సంగీతం, యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. గత సినిమాలకు భిన్నంగా ‘సాక్ష్యం’లో శ్రీనివాస్ కండలు తిరిగిన బాడీతో కట్టిపడేస్తున్నాడు. ఇక హీరోయిన్ పూజా హెగ్డే మరో ఆకర్షణ. అయితే సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ సాయిమాధవ్ బుర్రా డైలాగులు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో సాయిమాధవ్ తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు ‘సాక్ష్యం’లో కూడా సాయిమాధవ్ తన కలం పవర్ చూపించారని టాక్.

ఈ భూమ్మీద తప్పుచేసిన ప్రతి ఒక్కరు నాలుగు దిక్కులు వెతికి.. ఎవ్వరూ చూడలేదని అనుకుంటారని, కానీ పైనుంచి ఐదవ దిక్కు మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటుందని, దాని నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదనే కాన్సెప్ట్‌తో ‘సాక్ష్యం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్థర్ ఎ. విల్సన్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణ కానుంది. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఫాంటసీ థ్రిల్లర్‌ను జోడించి దర్శకుడు శ్రీవాస్ మనకు అందిస్తున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో మరి కొద్ది గంటల్లో తెలిసిపోనుంది.

Comments