Posts

Showing posts from July, 2018

రివ్యూ: హ్యాపి వెడ్డింగ్‌

Image
రివ్యూ: హ్యాపి వెడ్డింగ్‌
రివ్యూ: హ్యాపి వెడ్డింగ్‌
రేటింగ్‌: 1.75 /5
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెల, రాజా, నరేష్‌, మురళీ శర్మ, పవిత్ర లోకేష్‌, ఇంద్రజ, అన్నపూర్ణ, తులసి తదితరులు
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
నిర్మాత: ఎమ్‌. సుమంత్‌ రాజు
దర్శకత్వం: లక్ష్మణ్‌ కార్య


టైటిల్ తోనే ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకున్న మెగా డాటర్ హ్యాపీ వెడ్డింగ్ మీద ప్రేక్షకులకు ఓ మోస్తరు అంచనాలు అయితే ఉన్నాయి.

”ఒక మనసు” తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నీహారిక… ఈ సినిమా పై ముందు నుంచి పాజిటివ్ గా ఉంది. దానికి తోడు యూవీ సంస్థ లాంటి బ్యాక్ అప్ ఉండటంతో మార్కెటింగ్ బాగానే జరిగింది. సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన హ్యాపీ వెడ్డింగ్ ద్వారా లక్ష్మణ్ కార్య దర్శకుడిగా పరిచయమయ్యాడు.

అక్షర (నీహారిక) స్థిమితంగా ఏ నిర్ణయం తీసుకోలేని అమ్మాయి. ప్రతిదానికీ అయోమయం. తొలుత విజయ్ (రాజా) ను ప్రేమించి అతను తనను అర్థం చేసుకోలేదని ఆనంద్ (సుమంత్ అశ్విన్) వైపు టర్న్ అవుతుంది. తల్లితండ్రులు పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. కానీ ఆనంద్ వ్యవహార శైలి అంతగా నచ్చకపోవడంతో తిరిగి విజయ్ గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఈ లోపు పెళ్లి ముహూర్తం దగ్గర…

రివ్యూ:సాక్ష్యం

Image
రివ్యూ:సాక్ష్యం
రివ్యూ: సాక్ష్యం

రేటింగ్‌: 2.75/5
న‌టీన‌టులు:బెల్లంకొండ సాయి శ్రీనివాస్,పూజా హెగ్డే,శరత్ కుమార్,మీనా,జగపతిబాబు,అశుతోష్ రానా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: శ్రీవాస్
నిర్మాత‌: అభిషేక్ నమ

‘జయ జానకి నాయక’ సినిమాతో బెల్లకొండ సాయి శ్రీనివాస్ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో పక్కా కమర్షియల్ హీరోగా మారాడు. ఈ క్రమంలో ‘సాక్ష్యం’ అనే ఫాంటసీ థ్రిల్లర్‌లో నటించాడు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

అదిరిపోయే విజువల్స్‌తో, అద్భుతమైన నేపథ్య సంగీతం, యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. గత సినిమాలకు భిన్నంగా ‘సాక్ష్యం’లో శ్రీనివాస్ కండలు తిరిగిన బాడీతో కట్టిపడేస్తున్నాడు. ఇక హీరోయిన్ పూజా హెగ్డే మరో ఆకర్షణ. అయితే సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ సాయిమాధవ…

రివ్యూ:లవర్

Image
రివ్యూ:లవర్


రివ్యూ: లవర్

రేటింగ్‌: 2.5/5
న‌టీన‌టులు:రాజ్ తరుణ్, రిద్ది కుమార్, అజయ్, రాజీవ్ కనకాల,సుబ్బా రాజు త‌దిత‌రులు
సంగీతం: అంకిత్ తివారి
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: చ‌ంద్ర‌సిద్ధార్థ్
నిర్మాత‌: హర్షిత్ రెడ్డి & దిల్ రాజు

రాజ్ తరుణ్, రిద్ది కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ లవర్ ‘ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అనీష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకుడిగా పని చేసారు. ఇక గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ కి దిల్ రాజు లక్కీ హ్యాండ్ విజయాన్ని అందిస్తుందేమో వేచి చూడాలి.

ఈ సినిమాతోనైనా యువ హీరో రాజ్ తరుణ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడని ఆశిద్దాం. ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ మరియు ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది, ట్రైలర్ ని బట్టి ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.

ఇక సినిమా కథ విషయానికి వస్తే హీరో రాజ్ (రాజ్ తరుణ్) ఈ మూవీలో ఒక బైక్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. సినిమా మొదలైన కొద్దీ సేపటికే హీరో ఒక ఫైట్ లో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రి లో జాయిన్ అవుతాడు. అక్కడే పని చేస్తున్న హీరోయిన్ చరిత (రిద్ది కుమార్) ని మొదటి సారి …

రివ్యూ: ఆట‌గ‌ద‌రా శివ‌

Image
రివ్యూ: ఆట‌గ‌ద‌రా శివ‌


రివ్యూ: ఆట‌గ‌ద‌రా శివ‌

రేటింగ్‌: 2/5
న‌టీన‌టులు: ఉద‌య్ శంక‌ర్, దొడ్డ‌న్న‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, హైప‌ర్ ఆది త‌దిత‌రులు
సంగీతం: వాసుకి వైభ‌వ్
ఎడిటింగ్: న‌వీన్ నూలి
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: చ‌ంద్ర‌సిద్ధార్థ్
నిర్మాత‌: రాక్ లైన్ వెంక‌టేశ్

ఆట‌గ‌ద‌రా శివ‌.. హీరో ఎవ‌రో తెలియ‌దు.. నిర్మాత‌తో ప‌రిచ‌యం లేదు.. సినిమాలో తెలిసిన మొహాలు పెద్ద‌గా లేవు. కానీ ఇలాంటి సినిమాలు కూడా అప్పుడ‌ప్పుడూ మాయ చేస్తుంటాయి. మ‌రి ఆ న‌లుగురు లాంటి అద్భుత‌మైన సినిమా చేసిన చంద్ర‌సిద్ధార్థ్.. ఈ సారి ఏం మాయ చేసాడు..?

జంగ‌య్య‌(దొడ్డ‌న్న‌) ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌నిచేసే ఓ త‌ళారి. ఖైదీల‌ను ఉరితీయడం ఈయ‌న ప‌ని. ఇదే క్ర‌మంలోనే ఓ రోజు జంగ‌య్య‌కు జైల్లో ఉన్న బాబ్జీ(ఉద‌య్ శంక‌ర్) ను ఉరి తీయాల‌ని క‌బురు వ‌స్తుంది. కానీ అంత‌లోనే బాబ్జీ జైలు నుంచి త‌ప్పించుకుంటాడు. అది తెలియ‌క త‌న ప‌ని కోసం వ‌స్తున్న జంగ‌య్య జీపులోకి ఓ వ్య‌క్తి వ‌చ్చి చేర‌తాడు. అత‌డే పారిపోయిన ఖైదీ అని జంగ‌య్య‌కు తెలియ‌దు.

ఆ ప్ర‌యాణంలోనే ఇంటినుంచి పారిపోయిన ప్రేమికులు ఆది(హైప‌ర్ ఆది), అత‌డి ప్రేయ‌సి వీళ్ళ‌తో క‌లుస్తారు. అప్ప‌టికే జంగ‌య్య‌తో పాటు ఆదికి కూడా బ…

రివ్యూ: W/O రామ్

Image
రివ్యూ: W/O రామ్రివ్యూ:W/O రామ్
రేటింగ్‌: 2.5/5
తారాగణం: మంచు లక్ష్మీ,సామ్రాట్ రెడ్డి,ఆదర్శ్ బాలకృష్ణ,ప్రియదర్శి
సంగీతం: రఘు దీక్షిత్
నిర్మాత: వివేక్ కూచిభొట్ల
దర్శకత్వం: విజయ్ ఏలకంటి


ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రొటీన్ స్టోరీ, కాసింత కామెడీ.. యూత్‌ను రప్పించడానికి మసాలా ఐటమ్ సాంగ్.. సినిమా అనగానే సగటు తెలుగు ప్రేక్షకుడి మదిలో మెదిలే ఆలోచన ఇది. ఈ రొటీన్ ఫార్ములాతోనే సినిమాలు తెరకెక్కడమే దీనికి కారణం. కానీ ఇటీవల తెలుగు సినీ పరిశ్రమకు కొత్త రక్తం దూసుకొస్తోంది. సందీప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లాంటి యువ దర్శకులు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

తెలుగు సినిమా అవధులు చెరిపేస్తున్నారు. వీళ్లలాగే ‘వైఫ్ ఆఫ్ రామ్’తో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈగ, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ పూర్తి వైవిధ్యమైన కథాంశంతో.. తెరకెక్కించిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ ఎలా ఉంది? మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా..? చూద్దాం.

పూర్తి వైవిధ్యంగా మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ ఇది. భర్త మరణించిన తర్వాత మర్డర్ కేసు మిస్టరీని చేధించడానికి భార్య చేసిన ప్రయ…

రివ్యూ: చినబాబు

Image
రివ్యూ: చినబాబు
రివ్యూ: చినబాబు

రేటింగ్‌: 3/5
తారాగణం: కార్తి,ప్రియా భవానీ శంకర్,సయేషా సైగల్,సూరీ,భానుప్రియ,సత్యరాజ్
సంగీతం: డి ఇమ్మాన్
నిర్మాత: సూర్య శివకుమార్ ,మిర్యాల రవింద్రర్ రెడ్డి
దర్శకత్వం: పాండిరాజ్తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ నటుల్లో ఒకరు. గతంలో ఆయన నటించిన యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, ఖాకీ లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. నాగార్జునతో కలిసి ఊపిరి మూవీలో నటించిన కార్తి.. తాజాగా ‘చినబాబు’గా మన ముందుకొచ్చారు. తమిళంలో ‘కడియకుట్టి సింగం’ పేరిట విడుదలైన ఈ మూవీ తెలుగులో ఎలా ఉంది..? కుటుంబ కథా చిత్రంతో మన ముందుకొచ్చిన కార్తి హిట్ కొట్టారా..? సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్)ది జమీందారీ కుటుంబం. ఆయన మొదటి భార్య మాధవి (విజి చంద్రశేఖర్)కు ఆడ పిల్లలే కావడంతో మగ సంతానం కోసం ఆమె చెల్లెలయిన భార్గవి (భానుప్రియ)ను పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికీ ఐదుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మాధవికి కొడుకు (కార్తి) జన్మిస్తాడు. ఐదుగురు అక్కల ముద్దుల తమ్ముడైన చినబాబు తండ్రిలాగే వ్యవసాయం చేస్తుంటాడు. అక్కల ఆప్యాయతల మధ్య పెరిగిన చినబాబు తన ఇద్దరు మేనకోడళ్లను కాదని మ…

రివ్యూ: విజేత

Image
రివ్యూ: విజేత 
రివ్యూ: విజేత
రేటింగ్‌: 2.5/5
తారాగణం: కల్యాణ్ దేవ్‌, మాళవిక నాయర్‌,  మురళీ శర్మ, జయప్రకాష్‌, తనికెళ్ల భరణి, నాజర్ తదితరులు
సంగీతం: హర్షవర్దన్‌ రామేశ్వర్‌
నిర్మాత: సాయి కొర్రపాటి
దర్శకత్వం: రాకేష్‌ శశి

మెగా కాంపౌండ్ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా ఆదరిస్తున్నారు అనే కారణం వల్లనో లేక చూడ్డానికి బాగానే ఉన్నాడు కదా ఒక ప్రయోగం చేసి చూద్దామనే తలంపో తెలియదు కానీ విజేత సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఒకటే అనుమానం.

ఇప్పటి దాకా వచ్చిన హీరోలు ఏదోరకంగా ఆ కుటుంబ సభ్యులే. కానీ చిరు కూతురిని పెళ్లి చేసుకున్న కారణంగా అందులో సభ్యుడైన కళ్యాణ్ దేవ్ వాళ్ళలాగా మెప్పిస్తాడా అని. దానికి తోడు ట్రైలర్ పర్వాలేదు అనిపించుకున్న తరుణంలో పెద్దగా కాదు కానీ ఓ మోస్తరు అంచనాలు అయితే అభిమానుల్లో ఉన్నాయి.

అనగనగా ఒక తండ్రి. పేరు శ్రీనివాసరావు (మురళీశర్మ). కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటాడు. అతనికో బాధ్యత లేని కొడుకు రామ్ (కళ్యాణ్ దేవ్). ఉద్యోగం రాలేదని స్వంతంగా ఒక కంపెనీ పెడితే అదీ ప్లాప్. దెబ్బకు నాన్నకు గుండెపోటు. హీరోకు కర్తవ్యం తెలిసి రంగంలోకి దిగుతాడు. దెబ్బ తీసిన కంపెనీని మళ్ళీ పెట్టి సక్సెస్ అందుకుంటాడు…

రివ్యూ: RX100

Image
రివ్యూ: RX100

సినిమా పేరు: RX 100

రేటింగ్‌:2.75/5

నటీనటులు: కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌, రాంకీ, రావు రమేశ్‌ తదితరులు

సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌

నిర్మాత: అశోక్‌ రెడ్డి

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్‌ భూపతి

కంటెంట్‌ బలంగా ఉన్న సినిమాలు విడుదల అవుతున్న తరుణంలో ‘RX 100’ అంటూ టైటిల్‌తోనే ఆకట్టుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. రామ్‌ గోపాల్‌ వర్మ వద్ద శిక్షణ తీసుకున్నారాయన. ‘సాధారణ సినిమాలు చూసేవారు నా సినిమాకు రావద్దు’ అని ఇదివరకు ప్రెస్‌మీట్లలో వెల్లడించారు. దర్శకుడు ఇంత కచ్చితంగా చెబుతున్నాడంటే సినిమాలో ఏదో కొత్తదనం ఉండే ఉంటుంది అని ప్రేక్షకులు అనుకున్నారు. మరి దర్శకుడు చెప్పినట్లుగానే సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అసలు ‘RX 100’ అంటే ఏంటి? తెలుసుకుందాం.

శివ(కార్తికేయ) చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోతాడు. డాడి(రాంకీ)నే తనకు సర్వస్వం. డాడి కూడా శివను కన్నకొడుకులా చూసుకుంటాడు. ఆ ఊరి ప్రెసిడెంట్‌ విశ్వనాథం(రావు రమేశ్‌) వద్ద సహాయకుడిగా పనిచేస్తుంటాడు డాడి. విశ్వనాథం ప్రెసిడెంట్‌ అవ్వడానికి డాడినే మూలకారణం. అయితే ఈ విషయాలన్నీ మర్చిపోయిన విశ్వనాథం డాడికి ఇష్టంలేని పనులు కూడా చేస్తుంటాడు. విశ్వనాథం…

రివ్యూ : తేజ్ ఐ లవ్ యు

Image
రివ్యూ : తేజ్ ఐ లవ్ యు


రివ్యూ:తేజ్ ఐ లవ్  యు
రేటింగ్‌:2.5/5
తారాగణం:  సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, పృథ్వి తదితరులు
సంగీతం:  గోపి సుందర్
నిర్మాత:  కెఎస్ రామారావు
దర్శకత్వం:  కరుణాకరన్


అనగనగా ఒక తెలుగు సినిమా కథ అని ముందు తరానికి చెబుతూ పాత క్లాసిక్స్ ని రీ మిక్స్ చేసి చూపించే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తుంటే. కొన్ని మాత్రం మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిపోతుందేమో అని నమ్మకం కలిగించేలా చేస్తాయి.

కానీ గత ఆరు నెలల కాలంలో టాలీవుడ్ ని పలకరించిన సినిమాలను చూస్తే రెండో బ్యాచ్ లో వస్తున్న సినిమాల కంటే మొదటి సిరీస్ లో వస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక మెగా కాంపౌండ్ హీరో సినిమా ఇంత తక్కువ అంచనాలతో రావడం బహుశా తేజ్ ఐ లవ్ యు విషయంలోనే జరిగి ఉంటుంది. ట్రైలర్ తో పాటు ఆడియో కూడా ఏమంత మెప్పించేలా లేకపోవడం… ముందు నుంచే మైనస్ కాగా…. ఫైనల్ గా పరాజయాల పరంపరకు తేజు బ్రేక్ వేసుకున్నాడా చూద్దాం….

చిన్నప్పుడు హీరోయిన్ తల్లిని ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో కొందరు అటకాయించబోతే తేజు (సాయి ధరమ్ తేజ్) అందులో ఒకడిని చంపి బాల నేరస్తుడిగ…

రివ్యూ: పంతం

Image
రివ్యూ:  పంతం


రివ్యూ:  పంతం

రేటింగ్‌: 2/5
తారాగణం: గోపీచంద్, మెహ్రీన్, సంపత్ రాజ్,  జయ ప్రకాష్ రెడ్డి, పృథ్వీ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
సంగీతం:  గోపీ సుందర్
నిర్మాత: కె.కె.రాధా మోహన్
దర్శకత్వం: చక్రవర్తి

విక్రాంత్ (గోపిచంద్) మినిస్టర్ల కు చెందిన బ్లాక్ మనీని దొంగతనం చేస్తూ…. ఎవరికి తెలియకుండా ఒక ట్రస్ట్ ద్వారా తానుంటున్న కాలనీ అభివృద్ధికి రహస్యంగా ఖర్చు పెడుతూ ఉంటాడు. హోమ్ మినిస్టర్ జయేంద్ర (సంపత్ రాజ్) అందరికంటే పెద్ద బాధితుడిగా మారాతాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇవన్నీ చేస్తోంది విక్రాంత్ అని తెలుస్తుంది.

కానీ అందరు అనుకున్నట్టు విక్రాంత్ సామాన్యుడు కాదని అతను ఇవన్నీ చేయడానికి బలమైన కారణం ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు. తర్వాత జరిగే పరిణామాల నేపధ్యంలో విక్రాంత్ అరెస్ట్ అయ్యి కోర్టు దాకా వస్తాడు. ఇలా దొంగతనాలు చేయాలనే పంతం విక్రాంత్ ఎందుకు పూనాడు దాని వెనుక ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ తెరమీద చూడాలి.

గోపీచంద్ పాదరసం లాంటి యాక్టర్. ఎలా మలుచుకుంటే అలా మారతాడు. కాకపోతే ఇతన్ని ఎలా వాడుకోవాలో తెలియక అప్పుడెప్పుడో వచ్చిన యజ్ఞం-రణం లాంటి ఫార్ములా సినిమాల పంధాలోనే కథలు రాసుకుంటూ గోపిచంద్ ని బోల్తా క…

రివ్యూ : శంభో శంకర

Image
రివ్యూ : శంభో శంకర


రివ్యూ: శంభో శంకర
రేటింగ్‌: 2/5
తారాగణం: షకలక శంకర్,కారుణ్య చౌదరి,అజయ్ తదితరులు
సంగీతం:సాయి కార్తీక్
నిర్మాత: వై.రమణ రెడ్డి మరియు సురేష్ కొండేటి
దర్శకత్వం: శ్రీధర్

సినిమాకు ప్రధాన బలం హీరో. కథతో సంబంధం లేకుండా ముందు ప్రేక్షకులు హీరోను చూసే సినిమాకు వెళ్తారు. అందుకే హీరోకి అంత ప్రాధాన్యత. ప్రేక్షకులను మెప్పిస్తేనే ఆ హీరోకు మనుగడ ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగు తెరపైకి చాలా మంది హీరోలొచ్చారు. కొంత మంది నిలదొక్కుకున్నారు. కొందరు కనుమరుగైపోయారు. తాజాగా హాస్యనటుడు షకలక శంకర్ హీరోగా మారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ‘శంభో శంకర’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన స్థాయికి తగ్గ పాత్రలు రావడంలేదని, అందుకే హీరోగా మారానని చెపుతున్న శంకర్.. హీరోగా తన స్థాయిని చూపించాడా..? చూద్దాం..

అంకాలమ్మపల్లి ఒక చిన్న గ్రామం. అక్కడ ప్రెసిడెంట్(అజయ్ ఘోష్)దే రాజ్యం. 50 ఏళ్ల చరిత్ర ఉన్న కుటుంబం అంటూ గొప్పలు చెబుతుంటాడు. తన ముత్తాత దగ్గర నుంచి ఊరికి ప్రెసిడెంట్‌లు తమ కుటుంబం నుంచే అవుతున్నారని, ఊళ్లో అంతా తన మాటే వినాలని శాసిస్తాడు. ప్రజలకు ఎలాంటి సహాయం అందకుండా వారిని కాల్చుకు తింటాడు. అటవీ సంపదను ద…

రివ్యూ: ఈ నగరానికి ఏమైంది

Image
రివ్యూ: ఈ నగరానికి ఏమైంది


రివ్యూ: ఈ నగరానికి ఏమైంది?
రేటింగ్‌: 3/5
తారాగణం: సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, విశ్వక్ సేన్ నాయుడు, వెంకటేష్ కాకుమాను, సిమ్రన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌
నిర్మాత: సురేష్‌ బాబు
దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌


టాలీవుడ్ కూడా సాంప్రదాయ సినిమా పద్ధతికి భిన్నంగా నూతన దర్శకులు ప్రయోగాలు చేయటం మంచిదే కానీ ప్రాంతీయ సినిమా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా మలిచినప్పుడే వీటికి సక్సెస్ దక్కుతుంది. అప్పుడప్పుడు అలాంటి సినిమాలు వస్తున్నా రిస్క్ ఎందుకులే అనే ఉద్దేశంతో రెగ్యులర్ గా మాత్రం రావడం లేదు.

మొదటి సినిమా పెళ్లి చూపులతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్…. అందరు కొత్త కుర్రాళ్లతో చేసిన మూవీ ”ఈ నగరానికి ఏమైంది”. సురేష్ సంస్థ కావడంతో మార్కెటింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ వల్ల ప్రేక్షకుల్లో ముఖ్యంగా యూత్ లో ఇది ఓ మాదిరి అంచనాలు అయితే రేపగలిగింది.

సినిమా అంటే పిచ్చి ఉన్న నలుగురు కుర్రాళ్ళ కథ ఇది. కార్తీక్ (సుశాంత్ రెడ్డి), వివేక్(విశ్వక్ సేన్ నాయుడు), ఉపేంద్ర(వెంకటేష్), కౌశిక్(అభినవ్) కాలేజీ వయసు నుంచే ఫిలిం మేకింగ…

రివ్యూ: జంబ లకిడి పంబ

Image
రివ్యూ: జంబ లకిడి పంబ


రివ్యూ: జంబ లకిడి పంబ
రేటింగ్‌: 1.5 /5
తారాగణం:  శ్రీనివాస్‌ రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ మురళీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్‌ తదితరులు
సంగీతం:   గోపి సుందర్‌
నిర్మాత:  రవి, జోజో జోస్‌, శ్రీనివాస్‌ రెడ్డి
దర్శకత్వం:  జేబీ మురళీ కృష్ణ


మనకు కొత్త ఐడియాలు రాకపోతే ఏం చేయాలి. పాత క్లాసిక్స్ ని బయటికి తీసి అదే పేరుతో కిచిడి చేసి కొత్త యాక్టర్స్ తో తీసి ప్రేక్షకుల మీదకు వదలాలి. కొందరి దర్శకుల ధోరణి ఇలాగే ఉంది. సృజనాత్మకత అడుగంటిపోయినప్పుడు దర్శకులు చేసే ప్రయోగాలు వికటించి చూసేవాళ్లకు ఎంతటి నరకాన్ని మిగులుస్తున్నాయో చూస్తున్నా కూడా పరిస్థితిలో మార్పు రావడం లేదు.

అందుకే సక్సెస్ పది శాతం ఉంటే పరిశ్రమలో ఫెయిల్యూర్ మిగిలిన తొంబై శాతం ఆక్రమించుకుంది. నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే కొంత ఆసక్తి రేపిన ”జంబ లకిడి పంబ” ఏ కోవలోకి వస్తుందా అనే అనుమానం ప్రేక్షకుల్లో ఓ మూలాన ఉంది. ఏమో ఆనందో బ్రహ్మ తరహాలో ఏదైనా సర్ ప్రైజ్ ఇవ్వొచ్చేమో అన్న అంచనాతోనే థియేటర్ లోకి అడుగు పెట్టారు ప్రేక్షకులు. మరి వాటిని నిలబెట్టుకునేలా ఉందా లేదా చూద్దాం….

వరుణ్ (శ్రీనివాస రెడ్డి), పల్లవి (సిద్ది ఇద్నాని) ప్రేమ…

రివ్యూ: సమ్మోహనం

Image
రివ్యూ: సమ్మోహనం


రివ్యూ: సమ్మోహనం
రేటింగ్‌: 2.75 /5
తారాగణం: సుధీర్‌ బాబు, అదితి రావు హైదరి, నరేష్‌, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్‌ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌
దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ

సినీ తారను ప్రేమించే కుర్రాడి కథలను ‘శివరంజని’ సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఈ కుర్రాడి ప్రేమకథ భిన్నం. సినిమాలంటే అస్సలు ఇష్టం లేని, సినీ తారలపై సదాభిప్రాయం లేని ఓ కుర్రాడు.. ఒక హీరోయిన్‌ ప్రేమలో పడతాడు. ఆ హీరోయిన్ కూడా ఈ కుర్రాణ్ని ప్రేమిస్తుంది. ఒక స్టార్ హీరోయిన్, చిన్న పిల్లల బొమ్మలేసుకునే ఓ కుర్రాడి మధ్య నడిచే ప్రేమ కథే ఈ ‘సమ్మోహనం’. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఆవిష్కరించిన ఈ సున్నితమైన ప్రేమకథ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకపోయినా దర్శకుడిపై ఉన్న నమ్మకంతో సినీ ప్రేమికులు ఈ చిత్రం కోసం వేచి చూశారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దామా..

ఫైన్ ఆర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకుని పిల్లల కోసం బొమ్మలు గీస్తూ పుస్తక ప్రచురణ అవకాశం కోసం వేచి చూసే కుర్రాడు విజయ్ (సుధీర్‌బాబు). సినిమాలన్నా, సినీ తారలన్నా విజయ్‌కు అస్సలు పడదు. చులకన భావంతో చూస్తాడు. ఉత్తరా…

రివ్యూ : నా నువ్వే

Image
రివ్యూ : నా నువ్వే


రివ్యూ: నా నువ్వే
రేటింగ్‌: 1.5 /5
తారాగణం: కల్యాణ్ రామ్‌, తమన్నా, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళీ, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: శరత్
నిర్మాత: విజయ్‌ కుమార్‌ వట్టికూటి, కిరణ్ ముప్పవరపు
దర్శకత్వం:  జయేంద్ర


మాస్ హీరోలు ప్రేమ కథలు చేయటం ఎప్పుడూ రిస్కే. అందుకే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల కెరీర్లలో భూతద్దం వేసి చూసినా గొప్ప ప్రేమ కథ ఉన్న సినిమా ఉండదు. వాళ్ళను సీనియర్లు అనుకుంటే తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పూర్తి స్థాయి ప్రేమ కథను ఇప్పటి దాకా చేయలేదు.

వీళ్ళ స్థాయి లేనప్పటికీ కళ్యాణ్ రామ్ కు సైతం నందమూరి కాంపౌండ్ హీరోగా ఎంతో కొంత ఇమేజ్ అయితే ఉంది. కాకపోతే మాస్ పాత్రల్లోనే ఇంత దాకా కనిపిస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ మొదటిసారి ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ చేసాడు. అంచనాలు లేకపోయినా బాగుంది అనే టాక్ వస్తే అదే పికప్ అవుతుంది అనే నమ్మకంతో నా నువ్వేని విడుదల చేసారు.

మీరా (తమన్నా) కు డెస్టినీ అంటే పిచ్చి. జీవితంలో ప్రతిదీ దాని ప్రకారమే జరుగుతుంది అని బలంగా నమ్ముతుంది. వరుణ్ (కళ్యాణ్ రామ్) డెస్టినీ లేదని నమ్మే వ్యక్తి. అమెరికా వెళ్లాలనే ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల మూడు సార్లు ఫెయిల్ అవ…

రివ్యూ: కాలా

Image
రివ్యూ: కాలా


రివ్యూ: కాలా
రేటింగ్‌: 2.5 /5
తారాగణం: రజినీకాంత్, హ్యుమా ఖురేషి, నానా పటేకర్, సముద్రకని  తదితరులు
సంగీతం:  సంతోష్ నారాయణ్
నిర్మాత: ధనుష్ 
దర్శకత్వం:  పా. రంజిత్


మాఫియా నేపథ్యంలో సౌత్ లో సినిమాలు వరస బెట్టి రావడానికి ఊతమిచ్చింది సూపర్ స్టార్ రజినీకాంతే. బాషా సినిమా ద్వారా పాతికేళ్ల క్రితం సెట్ చేసిన స్టాండర్డ్ ఈ రోజుకీ ఫిలిం మేకర్స్ ఫాలో అవుతున్నారు అంటే దానికి కారణం సురేష్ కృష్ణ మేజిక్ తో పాటు రజినీలో ఉండే ఇన్ బిల్ట్ స్టైల్‌. ఆ తర్వాత ఈ ఛాయల్లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ దాన్ని మాత్రం బీట్ చేయలేకపోయాయి.

ఎవరో ఎందుకు రజనినే స్వయంగా దాన్ని రీ క్రియేట్ చేయలేకపోయాడు. కానీ సూపర్ స్టార్ ఫాన్స్ మాత్రం కాలా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఆ దిశగానే దీని మీద అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. ప్రేక్షకుల్లో అంతగా హోప్స్ లేనప్పటికీ ఏదైనా ఉండొచ్చు అనే కనీస ఆసక్తితో ఎదరుచూశారు. కాలా ఈ రోజు విడుదలైంది.

ఇది ఏళ్ళ నాటి పాత కథ. కొత్తదనం ఏమీ లేదు. హీరో ఉంటున్న ప్రాంతాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించే ఒక విలన్ మినిస్టర్ ని హీరో ఎదుర్కోవడం అనే పాయింట్ ఎన్ని సినిమాల్లో వచ్చిందో లెక్క బెట్టడం కష్టం. రామ్ చరణ్ ఎవ…

రివ్యూ : రాజుగాడు

Image
రివ్యూ : రాజుగాడు


రివ్యూ: రాజుగాడు
రేటింగ్‌: 1.5 /5
తారాగణం: రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్ర ప్రసాద్  తదితరులు
సంగీతం: గోపి సుందర్
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
దర్శకత్వం:  సంజనారెడ్డి

‘ఉయ్యాల జంపాలా’ చిత్రంతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. కానీ కొంతకాలంగా ఆయన సినిమాలేవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. తాజాగా ఈ హీరో నటించిన 'రాజుగాడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజనారెడ్డి ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మరి సినిమా అయినా.. రాజ్ తరుణ్‌కు విజయాన్ని అందించిందేమో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

రాజు (రాజ్ తరుణ్) చిన్నప్పటినుండి నుండి క్లెప్టోమేనియా అనే వింత జబ్బుతో బాధ పడుతుంటాడు. ఈ వ్యాధి లక్షణం తమకు తెలియకుండానే దొంగతనం చేయడం. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ప్రయోజనం ఉండదు. రాజుతో పాటు దొంగతనం చేసే అలవాటు కూడా పెరుగుతుంటుంది. ఒకరోజు హీరోయిన్ తన్విని (అమైరా దస్తూర్) చూసి మొదటి చూపులోనే ప్రేమపడుతాడు రాజు. తన్వి కూడా రాజుని ఇష్టపడుతుంది. తనకు దొంగతనాలు చేసే అలవాటు ఉందని తన్వికి తెలిస్తే ఎక్కడ దూరమవుతుందోనని త…

రివ్యూ : ఆఫీసర్

Image
రివ్యూ : ఆఫీసర్
రివ్యూ: ఆఫీసర్
రేటింగ్‌: 1.5/5
తారాగణం: నాగార్జున, మైరా సరీన్, షియాజీ షిండే తదితరులు
సంగీతం: రవి శంకర్
నిర్మాత:  ఆర్‌ కంపెనీ
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

అనగనగా ఒక దర్శకుడు. సినిమా గమనాన్ని మార్చి కొత్త నడకలు నేర్పాడు. అతన్ని ఆదర్శంగా తీసుకుని ఎందరో యువతరం దర్శకులు తమ టాలెంట్ తో ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు. అప్పట్లో ఆయన తీసిన సినిమాలు ఇప్పటికీ రిఫరెన్స్ గా వాడుకుంటూనే ఉంటారు. అదంతా గతం. ఇప్పుడు అతని పేరు చెబితేనే భయపడే పరిస్థితి.

ఎవరి గురించో మీరు మొదటి లైన్ లోనే గెస్ చేసుంటారు కాబట్టి స్ట్రెయిట్ గా పాయింట్ కు వచ్చేద్దాం. వర్మ అనే బ్రాండ్ ఇన్నేళ్ల పాటు నిలవడం అంటే శివ తాలూకు ప్రభావం ఇంకా పరిశ్రమ మీద సజీవంగా ఉండటమే. అలాంటి కాంబోలో ఇన్నేళ్ల తర్వాత సినిమా వస్తుంది అంటే ఎంతో కొంత ఆశించడం సహజం. అలా వచ్చిందే ఆఫీసర్. హైప్ లేకుండా తక్కువ థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా.

కథ విషయానికి వస్తే ముంబైలో ఉండే ఒక రౌడీ పోలీసు నారాయణ్ పసారి. అతను చేసే దుర్మార్గాల గురించి విచారించడానికి వస్తాడు శివాజీ రావు(నాగార్జున). ఆధారాలతో అరెస్ట్ కూడా చేస్తాడు. కానీ సాక్షిని చంపించి పసారి బయటకి వస్తాడు. ఆహా అనుకు…

రివ్యూ : అభిమన్యుడు

Image
రివ్యూ : అభిమన్యుడు


రివ్యూ: అభిమన్యుడు
రేటింగ్‌: 3.5/5
తారాగణం: విశాల్, సమంతా
సంగీతం:యువన్ శంకర్ రాజా
నిర్మాత:  విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
దర్శకత్వం: పి.ఎస్

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో విశాల్ ఒకరు. పొగరు, పందెం కోడి వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యారు విశాల్. ఆ తరువాత ‘పందెంకోడి’ చిత్రం స్థాయిలో హిట్ సినిమాను అందుకోలేదనే చెప్పాలి. సక్సెస్ కోసం అన్వేషణ సాగిస్తున్న క్రమంలో కొన్ని చిత్రాలతో హీరోగా మెప్పించాడు. తాజాగా తమిళంలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న 'ఇరుంబు తిరై' చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

తన తండ్రి అప్పులు చేయడం, అప్పులవాళ్లు ఇంటికి వచ్చి అడిగితే తప్పించుకొని తిరగడం వంటి విషయాలు కరుణాకరన్ (విశాల్) అలియాస్ కర్ణను బాగా ఇబ్బంది పెడతాయి. దీంతో పన్నెండేళ్లకే ఇంటి నుండి వెళ్ళిపోతాడు. మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్‌గా జీవితం గడుపుతుంటాడు. విపరీతమైన కోపం ఉండే కర్ణను ఏంగర్ మేనేజ్మెంట్‌లో సర్టిఫికేట్ తీసుకురావాలని మిలిటరీ అధికారులు ఆర్డర్ వేస్తారు. దానికోసం లతాదేవి (సమంతా) అనే సైక…

రివ్యూ : నేల టిక్కెట్టు

Image
రివ్యూ : నేల టిక్కెట్టు


రివ్యూ: నేల టిక్కెట్టు
రేటింగ్‌: 2/5
తారాగణం: రవితేజ, మాళవిక శర్మ, జగపతి బాబు తదితరులు
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
నిర్మాత: రామ్ తాళ్లూరి
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ

మహానటి, రంగస్థలం లాంటి సినిమాలు చూసి…. టాలీవుడ్ కొత్త అడుగులు వేస్తోంది అని సంబరపడే లోపే…. అబ్బే ఎక్కువ సేపు అలా ఉండడానికి వీల్లేదు అని హెచ్చరించడానికి కాబోలు…. అతి తక్కువ గ్యాప్ లోనే కొన్ని ఆణిముత్యాలు వస్తూ ఉంటాయి. కొన్ని నిజంగానే మెప్పిస్తే…. కొన్ని మాత్రం చుక్కలు చూపించేస్తాయి.

రవితేజ నేల టిక్కెట్టు అనగానే మాస్ ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి, అంచనా. చాలా రోజుల తర్వాత తనదైన శైలిలో మాస్ మహారాజ పేరున్న రవితేజ ఏదైనా మేజిక్ చేస్తాడేమో అని…. మరి అంతంత మాత్రం అంచనాలతో వచ్చిన నేల టిక్కెట్టు వాటిని అందుకునేలా ఉందా లేదా అనేది చూద్దాం….

కథ గురించి తక్కువగా మాట్లాడుకోవడం మంచిది. అనగనగా ఒక అనాథ… ఒక పెద్దయన పెంచి పెద్ద చేస్తాడు. ఆయనో పార్టీ మినిస్టర్ కూడా. దత్తత తీసుకున్న కొడుకే ఆస్తి మీద మోజుతో ఆ పెద్దాయనను బాంబు పెట్టి చంపేస్తాడు. దీంతో ప్రతీకారం కోసం రగిలిపోయిన మన అనాథ హీరో విలన్ కు తెలియకుండా హైదరాబాద్ వచ్చి మెల్లమె…