Posts

రివ్యూ: చిల‌సౌ

Image
రివ్యూ: చిల‌సౌ
రివ్యూ         : చిల‌సౌ
న‌టీన‌టులు   : సుశాంత్, రుహాని శ‌ర్మ‌, రోహిణి, జ‌య‌ప్ర‌కాశ్, వెన్నెల కిషోర్..
సంగీతం       : ప‌్ర‌శాంత్ విహారి
విడుద‌ల‌      : అన్న‌పూర్ణ స్టూడియోస్
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: రాహుల్ ర‌వీంద్ర‌న్

భారీ సినిమాలే కాదు.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో చిన్న సినిమాల‌కు కూడా గోల్డెన్ టైమ్ న‌డుస్తుంది. ముఖ్యంగా చిన్న క‌థ‌ల‌ను కూడా చెప్పే విధంగా చెప్తే ఇట్టే క‌నెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు సుశాంత్ కూడా ఇదే చేసాడు. తొలి హిట్ కోసం ఇలాంటి క్యూట్ ప్రేమ‌క‌థ‌ను న‌మ్ముకున్నాడు. మ‌రి చిల‌సౌ అంటూ ఈయ‌న ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల మెప్పు పొందాడు..?

అర్జున్(సుశాంత్) సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్. మంచి జీతం.. ఇళ్లు.. కార్ అన్నీ ఉంటాయి. కానీ పెళ్లంటే అస్స‌లు ఇష్టం ఉండ‌దు. కానీ ఇంట్లో వాళ్ళు ఎలాగైనా అర్జున్ కు పెళ్లి చేయాల‌ని చూస్తుంటారు. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కూడా నో చెప్తుంటాడు అర్జున్. ఇలాంటి స‌మ‌యంలో అర్జున్ వాళ్ళ అమ్మ అంజ‌లి(రుహానీ శ‌ర్మ‌)తో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుంది. చూసిన వెంట‌నే త‌న‌కు ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోవాల‌ని లేద‌ని చెప్పేస్తాడు అర్జున్. దానివ‌ల్ల అంజ‌లి జ…

రివ్యూ:గూఢచారి

Image
రివ్యూ:గూఢచారి


రివ్యూ:గూఢచారి

నటులు : అడవి శేషు, శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సుప్రియ యార్లగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకల
ప్రొడక్షన్స్ : అభిషేక్ పిక్చర్స్
డైరెక్షన్ : శశికిరన్ టిక్కా

క్యారెక్టర్ రోల్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అడవి శేష్ ఒక్కో చిత్రంతో తన సత్తా చాటుకుంటూ వచ్చాడు.
‘క్షణం’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’. సొంతంగా రాసుకున్న కథతో ఈసారి పాజిటివ్ బజ్‌తో థియేటర్స్ వస్తున్నాడు అడవి శేష్. సినిమాలో సైడ్ క్యారెక్టర్ గా నటించిన అడవిశేషు.. హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’. సొంతంగా రాసుకున్న కథతో ఈసారి పాజిటివ్ బజ్‌తో థియేటర్స్ వస్తున్నాడు అడవి శేష్. భారీ అంచనాల నడుమ శుక్రవారం నాడు (ఆగష్టు 3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎప్పటికే యు ఎస్‌లో ప్రిమియర్ షోలు పడటంతో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అమీ తుమి, పంజా, బలూపు వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో అడవి శేషు, షాషాన్ తన గూఢచారి థ్రిల్లర్ తెరకెక్కించారు. శశికిరన్ టిక్కా దర్శకత్వం వహించారు.

గోపి అలియాస్ అర్జున్ (ఆదివి సెష్) జాతీయ భద్రతా సంస్థలో చేరినందుకు మక్కువ, దేశం కోసం చనిపోయిన తన తండ…

రివ్యూ : బ్రాండ్ బాబు

Image
రివ్యూ : బ్రాండ్ బాబు
మూవీ రివ్యూ : బ్రాండ్ బాబు

రేటింగ్ : 2/5

నటీ నటులు : సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బా,మురళీ శర్మ,సత్యం రాజేష్ తదితరులు .

కథ : మారుతి

సంగీతం : జీవన్ బాబు (జె బి)

నిర్మాత : శైలేంద్ర బాబు

దర్శకత్వం : ప్రభాకర్.పి

బాల్యం నుండీ తండ్రి (మురళీ శర్మ ) తన కొడుకుని (సుమంత్ శైలేంద్ర) ని బ్రాండ్ కి బాగా అలవాటు చేసి అహంకారంతో పెంచుతాడు. ఇంట్లో తన సొంత తండ్రి చనిపోయినా నలుగురిలోనూ ఏడవకుండా నాలుగు గోడల మధ్య ఏడ్చి , నలుగురిలో ఉన్నప్పుడు కేవలం ఎక్స్ప్రెషన్స్ తప్ప ఎమోషన్స్ చూపించకూడదు అనే అహాన్ని నూరిపోస్తూ పెంచుతాడు తండ్రి.

పేద,మధ్యతరగతి ప్రజలంటే హీనంగా చూసే హీరో కి, తను పెళ్ళంటూ చేసుకుంటే ఒక గొప్పింటి అమ్మాయినే చేసుకోవాలని తద్వారా తన బ్రాండ్ పెంచుకోవాలని భావిస్తూ ఉంటాడు., అలా 'హోమ్ మినిస్టర్' కూతురు అయినటువంటి పావని (పూజిత పొన్నాడ ) ని పెళ్ళిచేసుకోవాలని తలచి , అనుకోకుండా అదే ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి(ఇషా రెబ్బ) ప్రేమలో చిక్కుకుంటాడు . అసలే పేద , మధ్య తరగతి జనాల్ని అసహ్యించుకునే హీరో అతని తండ్రికి ఎలాంటి సందర్భాలు ఎదురయ్యాయి అనేది మిగతా కాదాంశం.

విశ్లేషణ : కథ పరంగా కొత్తదేం కాదు, మన అ…

రివ్యూ: హ్యాపి వెడ్డింగ్‌

Image
రివ్యూ: హ్యాపి వెడ్డింగ్‌
రివ్యూ: హ్యాపి వెడ్డింగ్‌
రేటింగ్‌: 1.75 /5
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెల, రాజా, నరేష్‌, మురళీ శర్మ, పవిత్ర లోకేష్‌, ఇంద్రజ, అన్నపూర్ణ, తులసి తదితరులు
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
నిర్మాత: ఎమ్‌. సుమంత్‌ రాజు
దర్శకత్వం: లక్ష్మణ్‌ కార్య


టైటిల్ తోనే ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకున్న మెగా డాటర్ హ్యాపీ వెడ్డింగ్ మీద ప్రేక్షకులకు ఓ మోస్తరు అంచనాలు అయితే ఉన్నాయి.

”ఒక మనసు” తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నీహారిక… ఈ సినిమా పై ముందు నుంచి పాజిటివ్ గా ఉంది. దానికి తోడు యూవీ సంస్థ లాంటి బ్యాక్ అప్ ఉండటంతో మార్కెటింగ్ బాగానే జరిగింది. సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన హ్యాపీ వెడ్డింగ్ ద్వారా లక్ష్మణ్ కార్య దర్శకుడిగా పరిచయమయ్యాడు.

అక్షర (నీహారిక) స్థిమితంగా ఏ నిర్ణయం తీసుకోలేని అమ్మాయి. ప్రతిదానికీ అయోమయం. తొలుత విజయ్ (రాజా) ను ప్రేమించి అతను తనను అర్థం చేసుకోలేదని ఆనంద్ (సుమంత్ అశ్విన్) వైపు టర్న్ అవుతుంది. తల్లితండ్రులు పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. కానీ ఆనంద్ వ్యవహార శైలి అంతగా నచ్చకపోవడంతో తిరిగి విజయ్ గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఈ లోపు పెళ్లి ముహూర్తం దగ్గర…

రివ్యూ:సాక్ష్యం

Image
రివ్యూ:సాక్ష్యం
రివ్యూ: సాక్ష్యం

రేటింగ్‌: 2.75/5
న‌టీన‌టులు:బెల్లంకొండ సాయి శ్రీనివాస్,పూజా హెగ్డే,శరత్ కుమార్,మీనా,జగపతిబాబు,అశుతోష్ రానా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: శ్రీవాస్
నిర్మాత‌: అభిషేక్ నమ

‘జయ జానకి నాయక’ సినిమాతో బెల్లకొండ సాయి శ్రీనివాస్ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో పక్కా కమర్షియల్ హీరోగా మారాడు. ఈ క్రమంలో ‘సాక్ష్యం’ అనే ఫాంటసీ థ్రిల్లర్‌లో నటించాడు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

అదిరిపోయే విజువల్స్‌తో, అద్భుతమైన నేపథ్య సంగీతం, యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. గత సినిమాలకు భిన్నంగా ‘సాక్ష్యం’లో శ్రీనివాస్ కండలు తిరిగిన బాడీతో కట్టిపడేస్తున్నాడు. ఇక హీరోయిన్ పూజా హెగ్డే మరో ఆకర్షణ. అయితే సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ సాయిమాధవ…

రివ్యూ:లవర్

Image
రివ్యూ:లవర్


రివ్యూ: లవర్

రేటింగ్‌: 2.5/5
న‌టీన‌టులు:రాజ్ తరుణ్, రిద్ది కుమార్, అజయ్, రాజీవ్ కనకాల,సుబ్బా రాజు త‌దిత‌రులు
సంగీతం: అంకిత్ తివారి
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: చ‌ంద్ర‌సిద్ధార్థ్
నిర్మాత‌: హర్షిత్ రెడ్డి & దిల్ రాజు

రాజ్ తరుణ్, రిద్ది కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ లవర్ ‘ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అనీష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకుడిగా పని చేసారు. ఇక గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ కి దిల్ రాజు లక్కీ హ్యాండ్ విజయాన్ని అందిస్తుందేమో వేచి చూడాలి.

ఈ సినిమాతోనైనా యువ హీరో రాజ్ తరుణ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడని ఆశిద్దాం. ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ మరియు ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది, ట్రైలర్ ని బట్టి ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.

ఇక సినిమా కథ విషయానికి వస్తే హీరో రాజ్ (రాజ్ తరుణ్) ఈ మూవీలో ఒక బైక్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. సినిమా మొదలైన కొద్దీ సేపటికే హీరో ఒక ఫైట్ లో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రి లో జాయిన్ అవుతాడు. అక్కడే పని చేస్తున్న హీరోయిన్ చరిత (రిద్ది కుమార్) ని మొదటి సారి …

రివ్యూ: ఆట‌గ‌ద‌రా శివ‌

Image
రివ్యూ: ఆట‌గ‌ద‌రా శివ‌


రివ్యూ: ఆట‌గ‌ద‌రా శివ‌

రేటింగ్‌: 2/5
న‌టీన‌టులు: ఉద‌య్ శంక‌ర్, దొడ్డ‌న్న‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, హైప‌ర్ ఆది త‌దిత‌రులు
సంగీతం: వాసుకి వైభ‌వ్
ఎడిటింగ్: న‌వీన్ నూలి
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: చ‌ంద్ర‌సిద్ధార్థ్
నిర్మాత‌: రాక్ లైన్ వెంక‌టేశ్

ఆట‌గ‌ద‌రా శివ‌.. హీరో ఎవ‌రో తెలియ‌దు.. నిర్మాత‌తో ప‌రిచ‌యం లేదు.. సినిమాలో తెలిసిన మొహాలు పెద్ద‌గా లేవు. కానీ ఇలాంటి సినిమాలు కూడా అప్పుడ‌ప్పుడూ మాయ చేస్తుంటాయి. మ‌రి ఆ న‌లుగురు లాంటి అద్భుత‌మైన సినిమా చేసిన చంద్ర‌సిద్ధార్థ్.. ఈ సారి ఏం మాయ చేసాడు..?

జంగ‌య్య‌(దొడ్డ‌న్న‌) ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌నిచేసే ఓ త‌ళారి. ఖైదీల‌ను ఉరితీయడం ఈయ‌న ప‌ని. ఇదే క్ర‌మంలోనే ఓ రోజు జంగ‌య్య‌కు జైల్లో ఉన్న బాబ్జీ(ఉద‌య్ శంక‌ర్) ను ఉరి తీయాల‌ని క‌బురు వ‌స్తుంది. కానీ అంత‌లోనే బాబ్జీ జైలు నుంచి త‌ప్పించుకుంటాడు. అది తెలియ‌క త‌న ప‌ని కోసం వ‌స్తున్న జంగ‌య్య జీపులోకి ఓ వ్య‌క్తి వ‌చ్చి చేర‌తాడు. అత‌డే పారిపోయిన ఖైదీ అని జంగ‌య్య‌కు తెలియ‌దు.

ఆ ప్ర‌యాణంలోనే ఇంటినుంచి పారిపోయిన ప్రేమికులు ఆది(హైప‌ర్ ఆది), అత‌డి ప్రేయ‌సి వీళ్ళ‌తో క‌లుస్తారు. అప్ప‌టికే జంగ‌య్య‌తో పాటు ఆదికి కూడా బ…